![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ ఆదివారం నాటి ఎపిసోడ్ 91 లో... మురళి వాళ్ళు అందరు హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే బాబిన్ వచ్చి అన్న లక్కీ వచ్చిందని చెప్తాడు. లక్కీ నా అని మురళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే లక్కీ వస్తుంది. మురళి అంటూ దగ్గరికి వస్తుంది. హీరో లాగా ఉండేవాడివి అని లక్కీ అనగానే ఇప్పుడు కుడా అలాగే ఉన్నాడు కదా అని నందు అంటుంది.నువ్వు చాలా లక్కీ నందు అని లక్కీ అంటుంది. నేను కాదు నువ్వు మంచిగ సిటీలో ఉంటున్నావని నందు అంటుంది.
సిటీలో ఉన్నవాళ్ళంతా హ్యాపీగా ఉండరని లక్కీ అంటుంది. అప్పుడే పెద్దవిడ వచ్చి ఒసేయ్ లక్కీ ఎప్పుడు వచ్చినవ్ అని అడుగుతుంది. చిన్నప్పుడు మురళినే చేసుకుంటానని బాగా అన్నది అని పెద్దావిడ అంటుంది. మురళి బావ సిటీలో బోటిక్ పెడితే లక్షల్లో సంపాదించవచ్చు అని లక్కీ అనగానే మేం కూడా వస్తామని నందు అంటుంది. అదేంటీ అక్క అలా అంటున్నావని జాను అడుగుతుంది. మరి ఇక్కడ ఏం ఉంటుందని నందు అంటుంది. బావ నువ్వు వెళ్లి తన అడ్రెస్ కనుక్కోమని నందు చెప్పగానే మురళి అడ్రెస్ తీసుకుంటాడు. ఆ తర్వాత జాను లాయర్ కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఒకసారి వాదన మొదలు అయ్యాక అంత ప్రాసెస్ జరుగుతుంది. మనకి న్యాయం జరిగేలా నేను వాదిస్తానని లాయర్ చెప్తాడు. అదే విషయం మురళికి జాను చెప్తుంది.
జాను ఒకసారి సూర్యతో మాట్లాడొచ్చు కదా.. ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపిస్తుందని సూర్య అనగానే నాకు ఇష్టం లేదని జాను అంటుంది. ఆ తర్వాత మురళిని నందు ప్రేమగా గదిలోకి పిలుస్తుంది. అలా పిలవడంతో మురళి సిగ్గుపడుతాడు. లోపలికి వెళ్లి ఏంటి నందు అంటాడు. బావ అంటూ ప్రేమగా మనం సిటీకి వెళదామని చెప్తుంది. నువ్వు ఇంత ప్రేమగా పిలిచింది ఇందుకా అని మురళి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |